ఒక విస్మృత కథకుడు -కొడవంటి కాశీపతి రావు
చాసో,రోణంకి అప్పారావు వంటి సాహిత్యప్రముఖుల సన్నిహితత్వం తో సాహిత్యస్ఫూర్తి నిఅందుకుని ,రావిశాస్త్రి ఏ కలవ్య శిష్యరికం తో క్లుప్తత, గాఢతకలిగి పదునైన వాక్యానిర్మాణం తో సమాజం పై వ్యంగ్య బాణాలు సంధిస్తూ కథానిక ఎలా ఉండాలో తెలియజేసేలా వుండే కథల్ని 1964 నుండి పాతికేళ్ళపాటు ఆనాటి అన్నిమాస,వార పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వందకు పైగా రచనలు సాగించిన కథకుడు కొడవంటి కాశీ పతి రావు .
కాశీపతి రావు వెంట వెంటే తిరుగుతూ సాహిత్యసమావేశాలు జరుపుతూ తదనంతరం సాహిత్యరంగం లో మీసాలు మెలి తిప్పేంతగా ప్రముఖ సాహితి వేత్తలు గా రూపొందిన వాళ్ళు చాలా మందే వున్నారు. అందులో కొందరు భౌతికం గా లేరు .
ఇంకా కథలలో మాండలికం రాయటం అంతగా లేని కాలంలో రావిశాస్త్రి ప్రభావం తో అనేక కథలు రాశారు స్వీయరచనల్ని ముగ్ధ ,వెలుగు తుప్పర్లు ,బొంకుల దిబ్బ కథలు గా మూడు సంపుటాల్ని కాక విజయనగరం లోని తోలి తరం కథకుల మొదలు తరాల వారీగా కథలవాకిలి,కథా నగరం వంటి మూడు సంకలనాలు వెలువరించారు
తరవాత తర్వాత సాహిత్యరంగం లో పెల్లుబుకుతున్న అనేకానేక వివక్షతలకి నివ్వెర పోయి ,స్వార్ధప్రయోజనాల్ని ఆ శించే విధానాల్ని చూసి అసహ్యించుకుని తానూ సేకరించిన అమూల్య మైన కథకుల సంపుటాల్ని కథానిలయానికి అందజేసి,అస్త్ర సన్యాసం చేసి సాహిత్య సంస్థలకి ,సాహిత్యరంగానికి,పత్రికలకి దూరంగా వుండిపోయాడు.
ఇప్పుడు చాలా మంది కి కొడవంటి కాశీపతిరావు తెలియదు. విజయనగరం లో పుట్టి పెరిగి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన కాశీపతి రావుకి విజయనగ రం పట్ల గాఢమైన అనురక్తి విజయనగరాన్ని అమితం గా ప్రేమిస్తూ ,విజయనగరాన్ని శ్వాసిస్తూ వుండే కాశీపతిరావు విజయనగరానికి దూరంగా హైదరాబాద్ నగరం లో కుమారుల ఇంట తన 72 వ ఏట నిన్న( ఏప్రిల్ 19 గురువారం )రోజున భౌతికం గా కూడా దూరం అయ్యారు. ఈయన భార్య శిలా వీర్రాజు గారి సోదరి ,ఆమె రెండేళ్ల క్రితం చని పోయారు
ఈ కథకుడి తో రక్తం పంచుకు జన్మించటమేకాకుండా ,సాహిత్య వారసత్వాన్ని కూడా పంచుకున్నందుకు సోదరిగా ముఖపుస్తకం ద్వారా ఆయన్ని పరిచయం చేస్తూ అశృనివాళి అర్పిస్తున్నాను .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి