17, డిసెంబర్ 2013, మంగళవారం

new




అక్షరప్రవాహం



నాకు వూహతెలిసి

అమ్మానాన్న నాచేత అక్షరాల్ని దిద్దించిన వైనం గుర్తులేదు

పక్షి పిల్లలనోట్లో ఆహారాన్ని కూరినట్లు

నా నోట్లో అక్షరాల్ని మొదట ఎవరు నింపారో నేనెరగను

నాలుగక్షరం ముక్కల్ని నేర్చుకునే రాతుందోలేదోనని

అమ్మ వాపోవటమైతే తెలుసు

నాటి నుండి నెను ఏరుకుంటూనే వున్నాను

ఆ ప్రయత్నం లో

అక్షరమ్ముక్కలు నింపిన నా నాల్గు పట్టాలూ

కడుపాకల్నైతే తీరుస్తున్నాయ్ కానీ

మెదడాకలే తీరటం లేదు

కనిపించిన అక్షరమ్ముక్కనల్లా మింగుతునే వున్నాను

నా కడుపునిందా అక్షరమ్ముక్కలెఏ

నాకు అక్షరాలు కాలక్షేపం బఠాణీలు కావు

తాపీగా తౄప్తిగా మెదడుతో నమిలినమిలి మరీ భోంచేస్తాను

అజీర్తి చేసినటైతే మధ్యలోనే మానేస్తాను

ఒక్కోసారి నేనెరిగిన అక్షరాలే కొత్తతొడుగులు ధరిస్తాయ్

కొత్త అర్ధాలు పూసుకుంటాయ్ మింగుడుపడబోమని బెదిరిస్తాయ్

పట్టుదలే పదునుగాగల మెదడు ఊరుకోదు కదా

మరోసారి మరోసారి ఇంకా.....ఇంకా

నమిలి నమిలి మరీ మింగుతాను

సారాన్ని రక్తంలో కలుపుకుంటాను

మంచి ఆహారాక్షరాన్ని భోంచేసినప్పుడు

శరీరం నిండా అక్షరాలే ప్రవహిస్తాయి

హౄదయం నిండా ఆరోగ్యం స్పందిస్తుంది

మెదడు పొరలు మరింత పదునెక్కుతాయి

కణకణమూ ఆనందంగా సంచరిస్తాయి

అటువంటప్పుడు నేను

నిలువెల్లా అర్ధవంతమైన అక్షరప్రవాహమై

కలం లోంచి జారి పోతాను

3, డిసెంబర్ 2013, మంగళవారం

prayaaNam






ప్రయాణం





అంతుచిక్కనిదీ అర్ధం కానిదీ

ఏదో మనసు లో ప్రవేసించింది

కూర్చోనీయదూ నిలబడనీయదూ

నిద్రపోదామంటే రెప్పవాలదు

ఎలా ఐనా అంతుచూడాలనే ప్రయత్నం లో

నాకునేను సమయాన్ని మిగుల్చుకొని

కాలం కాగడాన్ని వెలిగించుకొని

ప్రయాణాన్ని ప్రారంభించాను

ఎక్కడా ఏఅలికిడీ లేదనుకొన్నాను

ఎందుకంటే ధ్యానంలో వున్నాను కదా

కానీ ఎక్కడో ఏమూలో

గందరగోళాలు వినిపిస్తూనే వున్నాయ్



ఇక లాభం లేదనుకొని

నాలోకి నేను ప్రవేసించాను

మౌనగుహల్లోకి తోసుకొంటూ తోసుకొంటూ

ముందుకే సాగుతోన్న నావెనకనే

నిశ్శబ్దపుతలుపుల్ని తడుతోన్నట్లు గా

మెత్తగా మంద్రం గా నా అడుగులసవ్వళ్ళే

కొంత సేపయ్యాక అనుమానం కలిగింది

నేను ప్రవేసిస్తున్నది నాలోకి నేనేనా?

ఏమో!

వెతుకుతున్నది నాలోని తాత్వికతనా?

చింతనకు దూరమౌతోన్న తాత్వికతనా?

ఏ మధనం మనసులోదా ఆలోచనలదా?

నిల్లువెల్లా కవ్వం చిలికినట్లూ కుదుపు



శోధిస్తున్నదాని కోసమైనా

సాధిస్తున్న దానికోసమైనా

నిశ్శబ్దాన్ని పూసుకొని నాచుట్టూ నేనై

పరిభ్రమిస్తున్న బొంగరాన్నై

తిరుగుతూ...... తిరుగుతూ..

నేలపైనే అక్షరాల్ని రాస్తూ.... రాస్తూ...రాస్తూ...

16, నవంబర్ 2013, శనివారం

emarupaatu tagadu

ఏమరుపాటు తగదు




ప్రతి మనిషి లోనూ

అంతరాంతరాలలో ఏమూలో

ఎక్కదో దాక్కునే వుంటుంది

రక్తంలో కణప్రవాహం లోనా

మనసులో ఎగిరే వూహల రెక్కలక్రిందనా

హ్రుదయ కవాట శబ్ధతరంగాలవెనకనా

కనురెప్పలకింద కలల అలజడి గానా

ఏ నిస్సహాయ క్షణం లోనో సూక్ష్మశరీరమై దూరి

శరీరమంతటా సంచరిస్తూనే వుండివుంటుంది

నవమాసాలూ మోసి రక్తం తోపాటూ

ఆకారాన్నీ అస్తిత్వాన్నీ పోతపోసిన

తల్లి నుండి అండరూపమై కలిసిందా

స్త్రీగర్భం లోకి సరాసరి బీజరూపమై జారిందా

అమాయకంగా కన్నిప్పిన శిశువు

పాలతోపాటూ విషాన్నీ తాగాడా

ఎదుగుతూ ఎదుగుతూ

ఇంతతి కసినీ కార్పణ్యాన్నీ

ఎక్కడనుండి సేకరించుకొని తనలో నిక్షిప్తం చేసుకొన్నాడు

ఏ అపజయమో గుందెనికోసిందనో

ఏ ఆగ్రహమో దావానలమై నిలువెల్లా దహించిందనో

ఏ అవమానమో హ్రుదయాన్ని చీల్చిందనో

ఎప్పుడో ఏక్షణం లోనో నిస్ప్రుహ

మనసుని ఆవరించిన సమయం లో

ప్రవేశించ్ విశ్వరూపమై

సుడిగాలిలా శరీరాన్ని చుట్టేసి

మనసునీ మస్తిష్కాన్నీ ఆక్రమించి

ఆధిపత్యం సాధించే యత్నం చేస్తునేవుంటుంది



నేలానీరు వాయువుల్నే కాదు

మనిషి తనలోని మనిషినీ

కాలుష్యం లోనే పెంచి పోషిస్తున్నాడేమో

అందుకే మరందుకేనేమో

కామ క్రోధ మద మాత్స్యర్యాలతో

ఒళ్లంతా కళ్లైన ఇంద్రుళ్లు

మన చుట్టూ నిశాచరులై తిరుగు తున్నారు

దంతాలు సాగి సాచిన కోరల్నీ

పదునుగోల్లు విచ్చిన పంజాల్నీసారిస్తూ ద్రాకులాలు

వీధుల్నిండా కవాతు చేస్తున్నారు

సీసాల్లో కదిలేవి దాహం తీర్చే నీళ్లు కావు

మత్తుని తలకెక్కించేవో

మల్లెల్ని మసి చేశే ఆంలా లొ

హస్తభూషణాల్ని చేసుకొని

కన్నవారి కంటి దీపాలు

దేశానికి రేపటి నాయకులు

సమాజాన్ని నడపాల్సిన నవ యువత

మాదక ద్రవ్యాల మత్తు లో నిర్వీర్యమైపోతూ

కురుక్షేత్రయుద్ధం లో చీలిన గుండెనుండి

ప్రతి రక్తబిందువూ రూపెత్తిన దుశ్శాసనుళ్లలా మారి

భూమి మీద ప్రతి ప్రాంతానా

వస్త్రాపహరణ సన్నడ్ధులై

చేతులు చాపుతూ తిరుగుతూనే వున్నారు

నిజానికి దానవత్వం కళ్లుతెరవడానికి

అర్ధరాత్రో అపరాత్రో కానక్కర్లేదు

పచ్చటి కుటుంబాల మధ్య

తల్లీపిల్లల్కీ

తంద్రీకూతుళ్లకీ

అక్కాతమ్ముళ్లకీ

అన్నాచెల్లెళ్లకీ

ఒక్కటొక్కటిగా

పరిమళించాల్సిన మానవసంబంధాలనన్నింటినీ

నిర్ధాక్షిణ్యం గా చిధ్రం చేస్తూ

కుట్రలతో కుతంత్రాలతో రగిలి పోవడం

కళాత్మకంగా రంగుల్లో చూపే మాన్ ష్టర్లని

నోరెళ్లబెట్టి చూడటం వరకైతే బాగానే వుంటుంది

చూస్తూ ...... చూస్తుండగానే

ఏదో ఒకనాడు

మానసికం గా మనని కూడా చంపి

మానవత్వం పై యుద్ధం ప్రకటించేందుకు

మనలో ఏ రక్తకణం చాటునో

మరో రక్తపిశాచి అవకాసం కోసం

పొంచి వుండే వుంటూంది

తస్మాత్ ... జాగ్రత్త

31, అక్టోబర్ 2013, గురువారం

bookreview

 

WAR A HEART’S RAVAGE: Seela Subhadra Devi (Translation of Telugu poem Yudham Oka Gunde Katha)


According to Wilfred Owen, “All a poet can do today is warn. That is why true poets must be truthful.” No doubt the poet Seela Subhadra Devi had been truthful to what she wanted to say to the global human spirit in the book, “War A Heart’s Ravage”. Amidst the mad catastrophes created by political power maniacs and the mindless revenge tactics conceived by religious fanatics, the innocent human child and the mother are the worst sufferers. In this backdrop of Pralay Tandav of war nobody questions life’s purpose any longer. The poet has been successful in creating heart a wrenching emotional picture as captured by her sensitive mind. Images hurl at us with the speed of missiles, jolting us to the reality. By reading the poem, not only do we visualize the inhuman butchering but also we feel the actual fear felt by those who had been haunted by sudden attack of war and gory death. One simple example is “legs slide like lifts, stairs as skates slither”.

The poet’s clarity of thinking is laudable at such places as when a mother is shown as an independent being separate from religion with inherent power to wipe out war tendencies. In a moving appeal- the poet exhorts all mothers to nurture the children in such a way to earn their names themselves after birth totally unlinked to religion.

War poetry always had its impact on poetry reading masses. But there is a marked difference between the earlier war poetry, which was a tribute to the brave soldier who sacrificed his life and this book. Here there are no war sung heroes. No patriotic feelings aroused. Only the mother and the child untouched by religion emerge as the victims of cruel schemes of the likes of Laden and Bush etc.


On the poetic canvas, we find not only war paintings such as “missile seeds sprout smoke trees” but also find a solution towards the end. The poet appeals for “a healing balm of fellow feeling”, for hatching one integral human offspring. There is a touching message to all the mothers “to lend their wombs to re-consecrate this planet with human touch—.”

A special mention of the translators P. Jaya Lakshmi and Bhargavi Rao should be made whose painstaking efforts resulted in giving the impression that the poem is originally written in English. Words and characters from Hindu mythologies give a taste of Indianness revealing the True Indian Spirit. Telugu words such as “Puli Judam”, retained as they are, make a curious reading.

- Lakshmi Turlapati


 


 


 

రెక్కల చూపు పై సమీక్ష



29, అక్టోబర్ 2013, మంగళవారం

War,a heart's ravege

Yudhdham Oka Gunde Kotha

Translators’ Note




In recent times, it’s become imperative for regional literatures to have not merely national but also global recognition without overlooking the apparently singular nature of the regional ethos. Besides, literature is no longer limited by regional, national and linguistic boundaries. There is forever a desire to erase the boundaries, find a relevance by fitting in the wider global canvas and not be termed regional, hence, parochial while continuing to retain its stamp of local, linguistic identity. This largely accounts for the current translation boom prevailing in native Indian literature.

Perhaps it is this urge to reach out to a wider readership and recognition at the international level, that now and then is seen a work like War, Hearts’ Ravage, to break free into another world where attention is gained through global concerns which are political, religious and humanistic, at once contemporary, thus lifting the poem to a world mind, if we may so call it. Armed with such a new identity, the present poem aims to frog leap into a wider global world of internationalism—in its theme at once national and international and in treatment regional-ethnic. The reader is called upon to familiarize and identify himself with all at once—regional Telugu, national Indian, and English international—gaining a multi-identity while continuing to retain its regional root identity.

At no time before has man felt the sense of doom engulfing life from all directions as in the present day. The much analyzed, anticipated Wasteland is felt as not yet showing any vegetation even after almost a century after it was foreseen. That which at one time appeared real, at another metaphorical and metaphysical, has now once again more intensely than before felt as real and threatening world humanity reducing several nations to Ground Zero in the post- September Eleven scenario. The absurdity of life, in this context, is not confined to one region or nation but is mapped through the entire world.

The writer, Smt. Seela Subhadra Devi, in tracing this situation discovers a collapse of culture, all that man held as responsible for holding this world together. In treatment of this theme at a global level, she probes its depths of despair with passion and emotion, strength and weakness through the eyes of a mother, rather a universal mother, who unlike Brechtian mother resents contributing her sons to war sacrifice. The writer offers possible solutions, with a sense of urgency as well as immediacy rarely achieved in Indian literature in recent times. The title, Yuddham oka gundekotha, when translated reads, war as a lacerating experience of the heart. The poem affirms its position as belonging proudly to a living, vibrant culture and literature native to its language. It creates its own space both at the national and international level by finding for itself a ‘contact zone’ where different cultures interact with each other through inter-exchange of human values which alone ultimately could bind nations together. It has in it elemental simplicity of its theme and a transparent innocence of its world view, allowing the poem to function like a perfect mirror through which are reflected simultaneously all the possible ways of regarding the problems encountered by man in the war-ridden scenario of the present day. Closely related to the above is the epic struggle metaphorically represented between the innocent and evil forces through the sport of ‘Puligoodam’. Above this is the overaction cosmic level where metaphysical principals and symbolic truths are extended and offered. And below it, the poem moves into folklore and fable as a search for meaning at the human level.

The text in the source language, Telugu, speaks for itself largely in its own idiom, but while translating into the target language, English, a compelling need is felt to make the poem largely speak in English idiom. To this extent, the translation comes as close and exact as possible to the meaning in the source text. At the same time it endeavors to see that the poem in its translated version read as an English poem. Attempt has also been made to express all aspects of meaning in a way that is readily understandable to the readers who may or may not be familiar with the source language. In doing so, took into account the total context of the poem while finding an exact expression to words.

It is no exaggeration to say that the task of translating such a text as War, Hearts’ Ravage, was found challenging and exacting. Certain words and lines which were found to require highlighting are indicated differently. English words used in the source language have been indicated through italics, while non-Telugu and non-English words have been highlighted through the use of single quotes, whereas popular English nursery rhyme quoted, has been retained as it is within double quotes and italicized like the rhyme “Twinkle twinkle little star(s) “.

When it came to finding an equivalent word for certain expressions we felt it more useful to employ terms that are familiar to English readers and desisted from indulging in a process that may otherwise prove laborious to translate, such as, ‘Democle’s sword’ and ‘Liliputans’. In addition, idiomatic expressions or allusions to myths, folklore and fable, culture-specific in nature, have been highlighted through italics and numbered, explanation for such is offered in the Glossary at the end of the text. The Glossary only provides information necessary for understanding a myth providing a context rather than explain the relevance of it, many of whom are woven into the poetic fabric of the text. Even here the Glossary is kept to the minimum, merely supplying the essential background, without pointing out the links to the poem. In this the translators hope that the reader would establish his own patterns and meanings directly from his reading.

This translation grew out of several extended conversations and exchanges with the writer and her husband Sri Seela Verraju, a writer in his own right, in the course of translating this text. We are thankful to them for permitting us to translate War, Hearts’ ravage. Our thanks are also due those of our friends and colleagues who took keen interest in our work and ever enthusiastically came forward to render every help necessary. We are grateful to Dr. G. K. Subbarayudu for his keen eye no the poetic quality of the translation, Dr. T. Vijay Kumar for his insights into translation, Dr. Seetha Das for her patient reading of the final draft and Smt. Krishnaveni for her enthusiastic response in the preparation of the Glossary.

All through this translation we tried to see that poetry is kept intact and not lost through translation and keep the reader in a responsive relationship with the poem. As mediators we are aware of the distance separating us from the poem’s emotion ,where the positions are defining not interchangeable in the least. We question ourselves, can that a distance be covered through translation?



P. Jayalakshmi

Bhargavi Rao

24, అక్టోబర్ 2013, గురువారం

nenu chinnappudu chitrakaarini gaa

నేను చిన్నప్పుడు వేసిన చిత్రాలు మా బళ్ళో నాకు మంచి చిత్రకారిణీ గా పేరున్నదండోయ్



swechchaalankaraNa

మెత్తని ఉరిత్రాళ్ళు








రంగుల చొక్కాలు వెలిగిపోతుండగా

బరిలోకి పదమూడుమంది ఆటగాళ్ళ్ళు ప్రవేసించారు

అది క్రీడాస్థలి-

కానీ-

బీరువాల్లో దాచిన రంగురంగుల కండువాల్లోంచి

అవకాసాన్ని బట్టి అవసరాన్ని బట్టి

ఒకటి ఎంచుకొని మెడకి వేలాడేసుకొని

దేశం నిండా వందలాది ఆటగాళ్ళు తిరుగు తున్నారు!

ఇది వూరువాడాల్లోని స్థితి



మనం గాలరీల్లోనూ మహాసభల్లోనే కాదు

ఇంట్లోనే కుర్చీలకు అతుక్కొని

కేరింతలు కొడ్తూ జయజయ ధ్వానాలు చేస్తూ

వుద్రేక పద్తూ ఆవేశపడ్తూ

భయకంపితలమౌతూ

నవరసాల్నీ ముఖం పై పులుముకుంటున్నాం



అక్కడ వికెట్లు పద్తుంటే

మనం సంసారాల్లో బొక్క బోర్లా పడ్తున్నాం

అక్కడెవరో పరుగులు తీస్తుంటే

మనం బాధల్నుండి దూరం గా పరుగులు పెడ్తున్నాం

మొన్నటి వరకూ రంధ్రా న్వేషణలతో చేసిన

దుర్భాషాదుర్గంధాల్ని కడిగేసుకొని

అక్కడికక్కడే కండువా మార్పిడులతో

ప్రశంసాపతాకాల్ని ఎగరేస్తుంటే

బిత్తరపోయి గుడ్లు మిటకరిస్తున్నాం



చిరకాలంగా మనసుల్ని కలబోసుకొన్న మిత్రులు

ఏ దార్లోనో ఎదురౌతే

ఒకరి సొత్తొకరం దోచుకున్నామేమోనని

ఒకరి భూమి ఒకరం కబ్జా చేసేసుకున్నామేమోనని

మనసులు మూసుకొని

ఒకరినొకరం అనుమానం గాచూసుకుంటున్నాం

ముఖాలకు మాస్కులు తొడుక్కొని

ప్లాస్టిక్ పలకరింపుల్ని చిలకరిస్తూ గడిపేస్తున్నాం



ప్రాణమిత్రుల మధ్యా ఆప్తబంధువుల మధ్యా

నిప్పులగుండాల్ని పరచి

మనసుల మధ్యా అనుబంధాల మధ్యా

పచ్చగడ్డిని రగిలించి

ఏ మనిషికామనిషిని ఏకాకిని చేస్తూ

సాగుతోన్న రాజకీయక్రీడలో

ముక్కూమొఖం తెలియని ఆటగాళ్ళ మీదా

ప్రజల్ని పట్టించుకోని ప్రజానాయకుల మీదా

బెట్టింగురెక్కల్ని తగిలించి

కష్టార్జితాల్ని ఎగరేస్తున్నాం



అంతే కానీ

అదంతా గారడీయేననీ

గెలుపోటములు ముందుగానే నిర్ణయమైనవేననీ

ఎవరు గెలిచినా ఎవరు ఓడినా

మనకు ఒరిగేది ఏమీ లేదనీ

లాభపడేది మాత్రం వాళ్ళే ననీ ఎరగం

సమయానుకూలంగా కండువాలు మార్చుకొంటూ

కప్పలతక్కిట్లో కూచొని

మన కోసమే బతుకుతున్నట్లు జరిగే

అవకాశవాద రాజనీతి నాటకం లో

మనం కూడా అమాయకపాత్రలమైపోతే

మాచిఫిక్సింగ్ రాజకీయక్రీడలో

వెర్రిబాగుల ప్రేక్షకులమైపోతే

మన మెడలకు కూడా

కండువాలే ఉరితాళ్ళై మెత్తగా బిగుసుకుంటాయ్





--శీలా సుభద్రా దేవి


 

21, అక్టోబర్ 2013, సోమవారం

naa akaasam nade







నా మానాన నన్ను నడవనివ్వకుండా

దుర్భిణీ చేత సారించి

వెంట వెంటే తిరుగుతున్నావెందుకూ?

నడకలో ఏ తప్పటడుగు పట్టించాలని

ఆలోచనల్లో ఏ దృష్టికోణాన్ని ఫోకస్ చేయాలని

మాటల్లో ఏ ప్రాంతీయతని ఎత్తి చూపాలని

అక్షరాల్లో ఏ వర్ణపు పోగుల్ని సాగదీయాలని

జీవితాన్ని ఏ చట్రం లో బంధించాలని

ఇలా భూతద్దం తో నావెంట పడ్డావ్?



చల్లని వెన్నెల్లో చంద్రికల్ని అద్దుకొని

మిలమిల మెరిసే మంచుబిందువుల్ని

ఆత్మీయంగా సేకరించే చంద్రచకోరాన్నై

రాత్రిపొడవునా సాహితీపచ్చికబయ్యళ్ళలో

స్వేచ్చావిహారం చేయాలనుకుంటే

నీడలా నీ చూపుల్ని నావెనకెనకే పరిగెట్టిస్తావెందుకు?

నా చేతనైనట్లు నాకోసం నేను

అచ్చం గా నాదనుకొనే స్వంత గడ్డపై కూడా

స్వతంత్రం గా తిరగలేని బతుకైపోయిన

అక్షరాల్ని ఏరుకొనే పిట్టని- అర్భకపు పక్షిని



ఇంట్లోపనులు చేసుకొంటూ

బాధల్నో బరువుల్నో దింపుకుంటూ

బియ్యం లో రాళ్ళతో పాటూ

కష్టాల్నో కన్నీళ్ళనో విదిలిస్తూ

పూలమాలల్ని అల్లుకుంటూ

నవ్వుల్నో అనుభూతుల్నో విరజిమ్ముతూ

పెరటిగుమ్మం లో కూచుని

ముచ్చట్లని కలబోసుకునే ఇల్లాళ్ళని గమనిస్తూ

చెమ్మగిల్లిన గింజల్ని ఏరుకున్నట్లు

పదాల్ని ఏరుకోవడమేకదా నేను చేస్తున్నది?



దారిపక్కన బీడైన పొలాల్నో

వరద తాకిడికి కొట్టుకుపోయిన పంటల్నో

తడిమి చూసుకుంటున్న బక్కరైతుల కంటతడో

అహంకారానికో అధికారానికో

జీవితాన్ని తాకట్టుపెట్టిన జీవచ్ఛవాలలో-

దానవుడైన మనిషి మానవత్వాన్ని

కాల్చినుసి చేసిన స్వార్ధపుమంటలో_

ఏదైతేనేం ఎవరైతేనేం

దృస్యమానమైనప్పుడు కన్నీటితోనో

చెమటతోనో రక్తంతోనో తడిసిన పరకల్ని

ముక్కుతో వొడిసి పట్టినట్ట్లుగా

చూపుల్ని చాచి

దృశ్యాల్నో సంఘటనల్నో మోసుకొస్తూ

సాహిత్యాన్ని అల్లుకునే గూటిపక్షిని



మనిషి సృష్టించిన డబ్బుకి మకిలివుంటుందేమో కానీ

ఎప్పటికప్పుడు జీవితరేఖలు

మేధస్సుని పుటంపెడ్తుంటే ఎగసిపడే జ్వాలల్లా వెలువడే అక్షరాలు

అక్షరాలా స్వచ్ఛమైనవే కదా

వాటికి ఏ రంగో వాసనో ఎందుకు వెతుకుతావు?



ఏ సాహిత్యరాజకీయాల్తోనో

ఎక్కడికక్కడ ముఠాలు కట్టి

స్వార్ధప్రయోజనాల్ని మడిగానో దడిగానో

పరిధులు చుట్టుకుని

కూర్చున్నప్పుడుమాత్రమే

అక్షరాలు కూడా మసిబారి రంగు తేలిపోతాయ్

అలా కానప్పుడు

ఏ అక్షరాలైనా పదాలపక్షులై

ఆకాశకాగితం నిండా పంక్తులుపంక్తులుగా

విహంగయానం చేస్తూనే వుంటాయ్

అదే కదా నేను చేస్తున్నది

గూటిపక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని

ఆలోచనల్ని ఆలపిస్తున్న నన్ను

ఏ పంజరం లోనో బంధించి

ఏ చూరుకో వేలాడదీయాలని చూస్తావెందుకు?

నా స్వేచ్ఛకు హద్దులు పెట్టకు.





------ శీలా సుభద్రాదేవి



27, ఆగస్టు 2013, మంగళవారం

freeverce frant letter

మిత్రులలో


చాలా మంది మీకు ఫ్రీవెర్స్ ఫ్రంట్ బహుమతి రాలేదని వస్తే బాగుండేదని అనే వారు. నిజమే నాకూ ఒకోసారి బాధ కలుగుతుంది. అయితే నాకు తృప్తి కలిగించేదీ వుంది. అదేమిటంటే కుందుర్తి గారు జీవించివున్నప్పుడే 1980 లో నా "ఆకలి నృత్యం" మొదటి కవితా సంపుటి వచ్చినప్పుడు అదే ఏడాఆది ఫ్రీవెర్స్ ఫ్రంట్ బహుమతి ప్రకటించి నప్పుడు ఆ ప్రకటన లో ఆ ఏడాఆది వుత్తమ సంపుటాలుగా చెప్పదగినవి అని మరో మూడు కవితాసంపుటాల పేర్లు ప్రకటించారు. వాటిలో ఒకటి నా "ఆకలినృత్యం".

కుందుర్తి గారి సంతకం తో ఆయన ద్వారా నాకు అందిన వుత్తరమే ఇది.

శీలావీర్రాజుగారు వాళ్ళావిడకి ఇచ్చేశారనే అపప్రధ లేకుండా నాకు వచ్చిన ఫ్రీవెర్స్ ఫ్రంట్ గుర్తింపు ఇది.




28, మే 2013, మంగళవారం

రచయిత్రి గంటివెంకటరమణకు అశ్రునివాళి

రచయిత్రి                                
గంటివెంకటరమణకు
అశ్రునివాళి


పాప్యులర్ రచనలతోనే కీర్తి కిరీటాలు అలంకరించుకున్న కొంతమంది రచయిత్రుల సరసన పే ర్కొనదగిన రచయిత్రి శ్రీమతి గంటి వెంకటరమణ కొద్దిపాటి ప్రతిభతో,ఒకటి రెండు ప్రచురణలతో,సాహిత్యరంగం లోకి చొచ్చుకొని పోయి వాక్చాతుర్యం తోనో ప్రముఖుల అండదండలతోనో సాహితీసంస్థల వెన్నుదన్నుతోనో అవకాసాలను కల్పించుకొని కొందరు ప్రముఖులుగా ఎదిగిపోతున్న సాహిత్యరంగంలొ అవేమీ పట్టించుకోకుండా వుపాధ్యాయ వ్రుత్తిని భుక్తి కోసమైతే ,మనసులోఎగసిపడే వూహావల్లరులను అవిశ్రాంతం గా నలభై ఏళ్ళకు పైగా అక్షరీకరించుకుంటూ 80 కి పైగా నవలలూ,అనేక కధలూరాసిన గంటి వెంకటరమణ నవలాప్రభంజనం నాటి పాఠకులకు తప్ప ఇతరులకు అనామకం గానే వుండిపోయింది.

బహుముఖప్రజ్ఞాశాలి ఐన వెంకటరమణ తన పిల్లలికి నటరాజరామక్రిష్ణ గారిదగ్గర న్రుత్యం నేర్పించటానికి తీసుకు వెళ్ళి ఆసక్తి తో తాను కూడా అభ్యసించింది.సంగీతం పై అభిరుచితో సంగీతసాధన చేసింది.భానుమతి పాటల్ని ముఖ్యం గా మల్లీశ్వరి పాటల్ని మధురం గా పాడేది.పాత హిందీ పాటలంటే ఆమెకు మరీ మరీ ఇష్టం.పాఠశాలలో పాఠాలు విద్యసంబంధమైన స్రుజనాత్మకమైన చార్టులతో పిల్లల్ని ఆకర్షించేది.ఇవన్నీ ఆమే విద్య,ఆసక్తులుగా అనుకుంటే వెంకటరమణ ప్రధానప్రవ్రుత్తి రచనావ్యాసంగం.

1966 లో ఆంధ్రప్రభ ఉగాది నవలలపోటీలో ఆనాటి రచయితలతో పోటీపడి "చదరంగం" నవలకుబహుమతి పొందింది. అప్పటి నుండి మరివెనుతిరగలేదు.ఆంధ్రప్రత్రిక,ప్రభ,యువ,స్వాతి,ఆంధ్రభూమి,చతుర వంటి ప్రముఖపత్రికలలోపుంఖానుపుంఖాలుగా నవలారచనలు చేసింది.సుమరు 80కిపైగానవలలు రాస్తే వాటిలొ మూడొంతులకు పైగా ధారావాహికలుగా రావటమేకాకవివిధ ప్రముఖ ప్రచురణ కర్తల ద్వారా పుస్తకాలుగారూపొంది65-75 మధ్య వువ్వేత్తున లేచిన నవలాప్రభంజనం లో తనకూ ఒక గుర్తింపుని సాధించుకొంది.

స్వాతి అనిల్ అవార్డ్ పోటీలలో మూడునాలుగు సార్లు మొదటి బహుమతిని సాధించుకొంది.అంతేకాక"అద్దెకు అమ్మానాన్న" అనే బహుమతి నవల స్వాతిలో ధారావాహికంగా వచ్చినప్పుడు దర్శకనిర్మాత కె.ఎస్.రామారావు స్వయంగా ఇంటికి వచ్చి 50,000రు తో నవలా హక్కులని కొనుక్కున్నారు.

గంటి వెంకటరమణ స్నేహశీలేకాక దగ్గరైన ప్రతీవారినీ దగ్గర బంధువరస తో పిలుస్తూ ఆత్మీయంగా దగ్గర అయ్యేది..ఆమే మాటలలో కల్మషం వుండదు.పసిపిల్లమనస్థత్వం కలిగి వుండేది.ఒకొక్కప్పుడు అమాయకం గా మాట్లాడె ఈమేనా ఇన్ని నవలలు రాసింది అనిపిస్తుంది.కానీ రచన చేయాలనుకున్నప్పుడు పాఠశాలలో ఎ ఖాళీ పిరియడు లోనో కూర్చొని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళినట్లుగా పరిసరాలు పట్టించుకోకుండా పేజీలకు పేజీలు రాస్తుండేది.అవి చదివి ఏవైనా లోపాలుచెప్పినా సహ్రుదయం తో వాటిని అంగీకరించేది.

ఎవరికైనా ఏమైనా సరే అన్యాయం జరిగినప్పుడు వెంటనే పోరాటస్ఫూర్థి తో ముందుకి దూసుకువచ్చేది. ఆ విధం గానే తాను పని చేసిన పాఠశాల నిరంకుశ యాజమాన్యాన్ని ఎదిరించి సహచర ఉద్యొగినులతో కలసి పోరాటం జరిపి పాఠశాలమూయించి పోష్ట్ తోసహా ఆర్టీసి వున్నతపాఠశాలలో చేరింది.అన్యాయాలని ఎదుర్కోడానికి ముందుండే వెంకటరమణ సంప్రదాయాలకి భక్తిశ్రధ్ధలకి తలవంచింది.అవసరాలకోసం,ప్రేమానురాగాలకోసం జీవితంలో చాలా విలువైనవి కోల్పోయింది.ఒకసారి రచయిత్రుల సభలో పాల్గొనటానికి వెళ్ళి సాహిత్యానికి.జీవనవిధానానికి, ప్రవర్తనకి కనబడుతున్న వ్యత్యసాలు గమనించి సాహిత్యసభలకి, సంస్థలకి దూరంగా వుండాలని నిర్ణయించుకొంది వెంకటరమణ.

తర్వాత కాలం లో నేను ఎంతగా ప్రయంత్నించినా ఆమె సభలకి,సమావేశాలకి రావటానికి అంగీకరించలేదు.తన సాహిత్యం తో మమేకమై తన ఇంట్లోనే వుండటానికి ఇష్టపడేది.

పాప్యులర్ రచనలు చేసినవాళ్ళలో ఎంతోమందికి అనేక అవార్డులూ,సత్కారాలూ కొన్ని ప్రయత్నపూర్వకం గానో,ప్రతిభాపరం గానో వరిస్తునే వున్నాయి.మన రాష్ట్రం లోనే చిన్నవో పెద్దవో ప్రభుత్వపరమైనవీ,వివిధసంస్థలకి చెందినవీ అధిక సంఖ్యల్లోనే అవార్డులు ప్రతీ ఏడాదీ సాహితీవేత్తలకు ప్రకటింపబడుతున్నాయి.కానీ 40 ఏళ్ళకు పైగా అవిశ్రాంతంగా రచనలు సాగించిన శ్రీమతి గంటి వెంకటరమణకు ఒక్క అవార్డు ఐన రాకపోవడం బాధాకరమైన విషయమే.ఇందుకు ఆమే జనం లోకి రాక పోవడం ఒక కారణమైతే,65-80 లలోని పాఠకాదరణ తోనే ఆమే త్రుప్తి చెందడం మరోకారణం..

గంటి వెంకటరమణ నవలల్లో లయవిన్యాసం,మ్రుదంగతాళం,మొగలిపొదలు,పూదోతలో గంటు ముళ్ళు,జీవనధార,భవభందాలు , పేయింగ్ గెస్ట్,డాక్టర్ కరుణ,,హొటల్ కార్నర్,గాజుబొమ్మలు,మరుద్వతీకన్య ప్రణయగాధ అత్యంత గుర్తింపు పొందినవి.2005 తర్వాత అప్పుడప్పుడు రాసినా పార్కిన్ సన్ వ్యాధి బారిన పది కలానికి విశ్రాంతి ఇవ్వక తప్పలేదు.

ఆమె తో సుమారు 15 సంవత్సరాల పాటు సహ వుధ్యోగిని గానే కాక తదనంతరమూ సాహిత్యసాన్నిహిత్యం,స్నేహబంధం కలిగి వున్నందుకు సాహిత్యరంగం తరపున శ్రీమతి గంటి వెంకటరమణకు ప్రేమతో నా ఈ అశ్రునివాళి

-_శీలా సుభద్రాదేవి







27, మే 2013, సోమవారం

oka vudayam kosam

ఒక వుదయం కోసం



కొత్తగా రెక్కలు విప్పుకొన్న పక్షులై ఆలోచనలన్నీ

జీవన వౄక్షమంతా ఎగురుతూదూకుతూ

కొమ్మకొమ్మనీ తడుముతూ

పత్రావిష్కారాల్ని చేస్తున్నాయ్

అప్పుడప్పుడే

విచ్చుకొంటున్న చిగురాశల్ని

రెక్కల్తో విసుర్తూ రెపరెపలాడిస్తున్నాయ్

కొత్తగా తొడిగిన మొగ్గల్ని ముద్దాడుతూ

ఫలించిన స్వప్నఫలాల్ని అబ్బురంగా చూస్తూ

వసివాడి రాల్తోన్న పండుటాకులకి

చెమ్మగిల్లిన హృదయం తో వీడ్కోలు పలుకుతూ

రాత్రంతా కలయతిరుగుతూనే వున్నాయ్



పొద్దంతా అలసి పోయిన శరీరం

విశ్రాంతిని కలవరిస్తూ

అస్తిరంగా పక్క మీద మెలికల పామై

లుంగలు చుట్టుకొంటోంది

ఎంతకీ రాని నిద్ర కోసం

ఎదురుచూసి ఎదురుచూసి

విసిగి వేసారి డస్సిపోయిన

విరహోత్కంటితలా కంటిపాప

రెప్పలతలుపుల్ని బార్లాతెరచి

చూపుకి చేరబడి గుమ్మం దగ్గరే కూలబడింది



రేపటి తొలి వేకువకి

నవచైతన్యం తో ఆహ్వానగీతికల్ని

ఆలపించిస్వాగతించడానికి

తగినశక్తిని సమకూర్చమనినిద్రని వేడుకొంటూ

మనసు మౌనముద్రని ధరించి

వుండుండి గుండె షహనాయ్ ని వూదుతూ

సావేరీరాగాలాపన సాగిస్తోంది

నన్నూ నా ఆలోచనల్నీ జోకొడ్తూ

నిద్ర అమ్మై తన ఒడిలోకి

ఎప్పుడు పొదువుకొంటుందో

3, మార్చి 2013, ఆదివారం

Walking with time


We go on walking

Sometimes we look back

What a lot of memories!

Folding the pages thro’ out the book of life

They demand to stop on and off and peruse

At every perusal, eyes becomes springs of tears.

Yet we can’ t stop looking back.

Drawing out with hands from the depths of hearts

We quench the thirst of the memories

Sometimes not knowing which way to go

We become statues at the crossroads of life.

On the way we fondly pluck the flowers that greet us

While feasting our eyes

They prick the fingers sharply with a thorn

That goes deep to the heart; still unmoved

We hug

The affectionately approaching friend of fragrance

And still go on walking

We are little children clutching the little finger of time.

While walking

We fumble, but never stop walking.

Just as mother protects in the arms and helps to walk

And pushes out from the nest when the wings are acquired

Hands change, yet we do not stop.

Walking takes a different course

Cutting new impressions

Weaving new attachments

Knitting flowers of experiences

Making colored designs all the way

Filling up all hearts with light, we go on.

Now and then some whirl wind rages.

Mixing up all colors, it hurls dust.

All dreams turn up to be bubbles.

Life in its reality lies flat on the road.

The heart that is aloft

Descends with wings broken.

Stopping our flight, we walk on

Being hurt by the stone hurdles of experiences

Feet become sore.



Heart gradually turns stone,

Those that started with us

Are no longer with us after a distance.

The faces of those walking around us

Go on changing like computer graphics,

We never fondle even if a little lamb peeps out of those faces

We are not frightened if the same face becomes a wolf and snarls

Does one having a stone heart fear any thing?

Does one, turning stubborn, step back?

Now and then our wounds will be aching

Yet we stick smiles all over the wounds

And light karthic lampes in the tank of tears.

Still our walk with time continues

Though the past blinds our eyes

Though the present breaks the heart

And the future frightens being dark,.

Holding the lighted torch of hopes

Fearlessly we go on walking.


-Seela Subhadra Devi

Translated by Kodavanti Leela Mohan Rao