27, అక్టోబర్ 2023, శుక్రవారం

పరికరాలు (నచ్చని కవిత)

~~ పరికరాలు~~ ప్రపంచంలోకి తలుపులు తెరిచామనో మానవ సంబంధాలను అర్థం చేసుకున్నామనో ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాం ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థమైపోతాయనీకాదు దేనికైనా పరికరాలు మాత్రమే దొరుకుతాయ్. అవగాహనకై వాటితో పనిచేయించటం ముఖ్యం ఎప్పటికప్పుడు ఆలోచనల్ని పదును పెడుతూనే ఉండాలి మన కార్యరంగం సమాజమే కదా ఎంత మంది మనుషులను కలిస్తే ఎన్ని సమూహహృదయాలను హత్తుకుంటే ఎంతదూరం ప్రయాణాలు చేస్తే అంతగా చూపు విశాలమవుతుంది ఆలోచన నిశితమవుతుంది. ఎప్పటికప్పుడు ఆలోచనల్లోని ఖాళీలను పూరించాలంటే మనోప్రపంచాన్నీశుధ్ధి చేసుకుంటూ ఆలోచనా పరిధి విస్తరించుకుంటూ జీవితపరిమితి తెలుసుకొంటూ మనిషి ఎదలోతుల్లోకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు మనుషుల మధ్యా సమూహాల మధ్యాతిరుగుతూ వారి వారి భౌతిక, సామాజిక అనుభవాలు మనవికూడా అనుకున్నప్పుడే మనసులోకి నింపుకునే ప్రయత్నం చేసినపుడే సరిగ్గా అప్పుడు కదా ఆలోచనాపరికరాలకు గుర్తింపు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి