8, అక్టోబర్ 2023, ఆదివారం

రంగు వెలిసిన సిత్రాలు -3

ఇప్పుడిప్పుడే వైకుంఠపాళి ఆట మొదలైంది గవ్వల్ని గలగలమనిపించే చేతులు దొంగ పందేలకు సన్నద్ధం అయ్యాయి పాముల నోటికి చిక్కకుండా ధనప్రవాహాలు పారాలి కదా నిచ్చెన మెట్లని దొరకపుచ్చుకోవాలంటే ఎన్ని సర్పయాగాలు చేయాలో ఏపందెం ఎట్లా వేయాలన్నా వెయ్యి కళ్ళ పహారాలు తప్పించుకోవాలి కదా ఏ నిచ్చెన ఎగబాకాలన్నా ఏ గెంతులు గెంతాలన్నా ఆటగాళ్ళ ఆలోచన ఒకటే ఈ పందెం బరిలో నెగ్గాలంటే ఏ పందెం కోడికి ఎంత బేరం పెట్టాలా అని ఏ బస్తీనేతని ఏ మొత్తంతో కొనాలా అని ఒక్కసారిగా చైతన్యం చిచ్చుబుడ్డై ఊరంతా వెలుగువెన్నెల వానౌతుంది సంతరించుకున్న పెళ్ళికళతో రహదారులన్నీ పెళ్ళిమంటపాలౌతాయి వాహనాలన్నీ రంగులద్దుకొని నీటిలో వదిలిన కార్తీక దీపాలౌతాయి గొంతు సవరించుకొన్న మైకులన్నీ మంటల్ని పిడుగులా వర్షించే క్యుములోనింబస్ మేఘాలౌతాయి జనంలో అలసట ఎరగని ఉత్సాహం జనసేకరణ బేరసారాల్తో గల్లీలీడర్ల ఆర్భాటాలు పండుగ ముస్తాబుతో కూడళ్ళంతటా భజనకీర్తనలు వాహనాలు పూలరథాలై వీథుల్నిండా కరపత్రాలజల్లులు విపక్షనాయకుల డొంకల్ని కదిలించి తీగల్నిలాగుతూ అవాకులూ చవాకుల్ని బాటకిరుపక్కలా గులకరాళ్ళుగా విసుర్తుంటే ఎవరు నీతిమంతులో అర్థం కాక పక్కకు తిరిగి నవ్వుల్ని బుగ్గల్లో దాచుకుంటున్న జనం రాజకీయతంత్రంలో మిత్రులెవ్వరో చిత్తుగా పడిపోయె శత్రువులెవ్వరో పెర్ముటేషన్ కాంబినేషన్ లలో క్షణక్షణానికీ మారిపోయే ఎత్తులో రకరకాలుగా రూపొందే సమీకరణాల్తో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థంకాని అయోమయంలో జనం అంతటా ఒకటే గందరగోళం ఎన్నికలల్లో ఎన్ని కళలో! • *. *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి