పాట తెచ్చిన తంటా
గల్పిక
" అమ్మా ఈ రోజుకి నేను వంట చేసేస్తాలే." బీటెక్ చదువుతోన్న లాస్య తనతల్లి దేవి చేతిలోని అట్లకాడ అందుకోబోయింది.
పాడుతోన్న కూనిరాగం ఆపి" ఎందుకే.నువ్వుకూర్చో వంటంతా ఐపోవచ్చింది.కూరముక్కలు మరికాస్తావేగుతే కూర పొడి వేసి కలిపి దింపేయటమే" అంటున్నా వినకుండా" నువ్వెళ్లి ముందుగదిలో కూర్చుని రెష్ట్ తీసుకో" అంటూ దేవిని పక్కకు జరిపి అట్లకాడ సింక్ లో పడేసి చెయ్యి కడుక్కుని మరో గరిట తీసింది లాస్య.
' సర్లే చేయని తనకి కూడా వంట అలవాటవ్వాలి కదా' అనుకుని ముందుగదిలో టీవీ ఛానల్స్ తిప్పుతూ మళ్ళా కూనిరాగం అందుకుంది దేవి.
అంతలో కొడుకు వంశీ వచ్చి దేవి చేతిలోని రిమోట్ ని కర్ఛిఫ్ తో లాక్కుని దీన్ని శుభ్రం గా తుడిచి మరో కర్ఛిప్ తల్లికి ఇచ్చి " కాస్త రెష్ట్ తీసుకో అమ్మా" అన్నాడు.
"అదేమిట్రా నన్ను టీవి చూడనివ్వవా" అని చిరుకోపం తో విసుక్కుని' సర్లే వాడు డిస్కవరీ ఛానల్ చూసుకుంటాడు కాబోలు'అని అక్కడనుంచి లేచి బెడ్ రూం కి వెళ్లి మళ్లా కూని రాగం అందుకుందిదేవి.
అంతసేపూ శేషశయనం లో పడుకుని సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తున్న రవి ఉలిక్కిపడిలేచి ' నేను వంశీరూం లో పడుకుంటాను"అన్నాడు.
తన సెల్ ఫోన్ కి ఇయర్ ప్లగ్ తగిలించి తలూపుతూ చెవికి పెట్టుకుంది దేవి.
అందులో తనకి ఇష్టమైన పాట వింటూ కూనిరాగం దాంతోపాటూ తీస్తూతీస్తూనే రాగాన్ని మరికాస్తా తారస్థాయికి తీసుకెళ్లింది.
అంతలో మాస్క్ పట్టుకుని సుపుత్రుడూ,సానిటైజర్ తో సుపుత్రికా గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యారు.వాళ్లవెనక రవి నిక్కినిక్కి చూస్తున్నాడు.
దేవి ఆశ్చర్యం చూస్తూ "ఏమిటిలా ఆంతా వచ్చేసారు'అంది.
"నువ్వు తుమ్ముతావేమోనని" నసిగారు.
అర్ధం కాని దేవి గభాలున లేవటంతో చేతిలోని సెల్ ఫోన్ లో స్పీకర్ ఆనై పోయి దేవికి ఇష్టమైన సాలూరు రాజేశ్వర్రావు గొంతులో పాట గట్టిగా వినిపించింది.
" తుమ్మెదా....ఒకసారి
మోమెత్తిచూడమని చెప్పవే
ఒకసారి ......తుమ్మెదా
తుమ్మె..దా.......".
( కీర్తి శేషులు సాలూరి వారికి క్షమాపణలతో)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి