31, మార్చి 2024, ఆదివారం

నడక దారిలో -38

తీసుకొని వచ్చి మమ్మల్ని సభలకు తీసుకు వెళ్ళేవారు.సంగీతం, సాహిత్యమే కాక కళాకృతులంటే కూడా ఆసక్తి ఉండటంవలన మాకుటుంబానికి చాలా దగ్గర అయ్యారు. ఉద్యోగం హడావుడి లేదు కనుక పూర్తిస్థాయిలో ముఖచిత్రాలు వేయటం, కవిత్వం రాసుకోవటం మొదలు పెట్టారు.నేను ఉదయమే టిఫిన్ ,కూరా,పప్పూ చేసి నాకూ,పల్లవికి బాక్స్ లు కట్టి ఎనిమిదిన్నరకల్లా బస్ కి బయలుదేరిపోయేదాన్ని. వీర్రాజు గారు పన్నెండు కి తనకోసం కుక్కర్లో అన్నం పెట్టుకొనేవారు.పగలు కబుర్లు చెప్పుకోవటానికి తరుచూ కె.కె.మీనన్ గారో, రామడుగు రాధాకృష్ణ మూర్తిగారో వచ్చేవారు.వాళ్ళకూడా తరుచూ వీర్రాజు గారితో బాటూ భోజనం చేసేవారు.ఇతర కవులూ,రచయితలు కూడా వస్తుండే వారు.అందుచేత ఆయనకు రోజంతా గడచిపోయేది. ఇక ఆదివారం , సెలవురోజుల్లో అయితే రోజంతా స్టౌ మీద టీలు కాగుతూనే ఉండేవి.సాహితీ మిత్రులతో వీర్రాజుగారు చాలా బిజీగా అయిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి