ఈ రోజు నేను పరిచయం చేయాలనుకున్న పుస్తకం" సవాలక్ష సందేహాలు ( స్త్రీలు- ఆరోగ్యం సమస్యలు)"
సుమారు తొమ్మిది సంవత్సరాల కాలం స్త్రీ లే ఆరోగ్యం సమస్యలు గురించి అందరికీ అర్థం అయ్యే విధంగా ఒక పుస్తకం తీసుకు రావాల్సిన అవసరం గురించి అనేక విధాలుగా చర్చలూ, ప్రయత్నాలు, పరిశోధన ఫలితంగా ఈ పుస్తకాన్ని 1991 లో స్త్రీ సంఘటన ప్రచురించింది .
వీణా శతృఘ్న,కె.లలిత,ఉమా నారంగ్,ఉమా మహేశ్వరి,గీతా రామస్వామి, రామరాజ్యం,సుమతీ నాయర్ ఒక గ్రూప్ గా ఏర్పడి కూర్చిన పుస్తకం.
అందులోనూ నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆర్ధిక అసమానత, అనేకానేక వివక్షల కారణంగా స్త్రీ లను రోజువారీ బాధించే ఆరోగ్య సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక డాక్టర్లను తమ సందేహాలను గూర్చి ప్రశ్నించలేక, కొన్ని సందర్భాలలో డాక్టర్లు మాట్లాడే థోరణులనూ, అవమానాలు దిగమింగే వ్యవస్థ ని గమనించి కూర్చిన పుస్తకం.
1971 లో " మన శరీరాలు- మనం (Our bodies- Our selves)" పుస్తకాన్ని ఫెమినిస్ట్ ఉద్యమం లో భాగం గా బోస్టన్ ఉమెన్స్ హెల్త్ కలెక్టివ్ వారు ప్రచురించారు.
1982లో ఆ పుస్తకం తో ప్రభావితమై చర్చలు జరిపి తొలుత అదే అనువదించాలనుకున్నారు.సౌకర్యాలులేని, అధికశాతం మంది, దారిద్ర్యం, నిరక్షరాస్యత తో బాధపడే మన ప్రజలకూ,మన స్త్రీలకూ పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి కి పోలిక లేదని భావించారు.
గ్రూప్ సభ్యులంతా గ్రామాలు,పట్టణాల లో గుడిసెల ప్రాంతాల కీ,నర్సింగ్ హోం లోకీ,ఆసుపత్రులకీ,స్నేహితుల ఇళ్ళకీ ఇలా ప్రతీ చోటుకీ వెళ్ళి తెలుసుకున్న ఫలితాలకు విస్తు పోయారు.
అంతులేని స్త్రీల సమస్యలూ,సమస్యలలోతులూ,సంఘంతో, కుటుంబం తో వైద్య వ్యవస్ధ తో స్త్రీలు పడే బాధలు అవమానాలు గమనించారు.
ఈ పుస్తకం ఎవరికోసం అనేదాన్ని గురించి చర్చించిన విషయాల్ని" పుస్తకం గురించి"అని ముందు గా వెళ్లారు." మధ్యతరగతి స్త్రీ లా,ఇళ్ళల్లో స్త్రీ లా, విద్యార్ధినుల, రైతాంగం స్త్రీ లా,కార్మికస్త్రీలా? అన్నివర్గాల సమస్యలన్నీ,పట్నవాసులు, పల్లెవాసుల,పేర్లూ,ధనికులూ అందరు స్త్రీలూ సాధారణంగా ఎదుర్కొధేనే అన్ని విషయాల్నీ చేర్చికూర్చాభన్నారు
అందరికి అర్థం అయ్యె లా సరళం గా, ఆసక్తికరంగా రాయటానికి ప్రయత్నం చేశారు.83 నాటికి ఒక కొలిక్కి తెచ్చి 84 చివరికి రాసిన అధ్యాయాలు సూఫీ,వసంత,రాణీ మొదలైన వారికి ఇచ్చి మళ్ళీమళ్ళీ తిరగరాసి 89 నాటికి ఒక రూపుకు వచ్చింది.అశ్లీలపదాలో,డాక్టర్ల సాంకేతిక భాషలో కాకుండా వాడుక భాషలో రాసే ప్రయత్నం జరిగింది.
ముఖచిత్రరూపకల్పన లక్ష్మాగౌడ్,లోపల పేజీలలో అవసరమైన ఫొటోలు బాల్ రెడ్డి,శ్రీవత్సన్,బొమ్మలు లక్ష్మీ వేయగ1991 కి పుస్తకం రూపం దాల్చింది.
ముందు మాటలో బ్రిటిష్ కాలం నుంచ మారుతోన్ ని వైద్యవిధానము, స్త్రీ లను మూర్ఖులు గా పిల్లలను కనేయంత్రం గా బాధ్యతారహితమైన తల్లులు గా మార్చే వ్యవస్థ గురించి సవినయంగా తెలిపారు.
అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో కొత్తగా రైతాంగం నిరోధసాధనాల ప్రయోగంలో స్త్రీ లును గినీపిగ్ లుగా చేయటాన్ని ఎదిరించారు.
చివరగా " అందుకే వైద్యం వ్యవస్థ ను విమర్శనాత్మకంగా పరిశీలించేందుకు, సాధ్యమైనంతవరకు ఈ గందరగోళం లో మళ్ళీ, మన శారీరక, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి మాకున్న సమాచారాన్ని, సందేహాలను అందరితో పంచుకోవాలనే చిన్న ప్రయత్నం ఈ పుస్తకం" అని సంపాదకవర్గం తెలియజేసారు.
ఇందులోని ముఖ్యాంశాలు తెలుసుకోవటానికి ఈ పుస్తకం లోని విషయసూచిక ఫొటోను మీ ముందు ఉంచుతున్నాను.
ఈ పుస్తకం లో పొందు పరచిన ప్రతీ విషయం మహిళలంతా తెలుసు కోవాల్సినవే.
కుటుంబం లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే,ఆరోగ్యవిషయాల పట్ల అవగాహన ఉన్నప్పుడే ఇంట్లో పిల్లలంతా ముఖ్యం గా ఆడపిల్లలు శారీరక మానసిక ఆరోగ్యం కలిగిఉంటారు.
ఈ పుస్తకం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా ఆరోగ్యసంస్ధలూ, ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా బస్తీల్లో, మారుమూల పల్లెల్లో పనిచేసే కార్యకర్తల కు ప్రత్యేక వర్క్ షాప్ లు ఏర్పాటుచేసి,ఈ పుస్తకం చదివించి అవగాహన కల్పించి మహిళలను జాగృత పరిచేలా చేస్తే బాగుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి