5, జులై 2024, శుక్రవారం

రంగు వెలిసిన సిత్రాలు -13

13వ భాగం కానీ నాయకులంతా ఒక్క విషయం గుర్తుంచుకోక తప్పదు గుండెలకు సర్జరీలు చేసి ఎన్ని ఆశల్ని గుప్పించినా ఎన్నెన్ని పథకాల శుధ్ధరక్తాన్ని నరాలగుండా ఎక్కించుతామన్నా ఒక్క సిట్టింగ్ డయాలసిస్ తో కొత్తతేజస్సు నింపుతామన్నా రెప్పల్ని ఎత్తి పెట్టి కళ్ళనిండా కోటికోటి కలల్ని రచించినా చెవుల్లో జోరీగలై ఝుమ్మంటూ వేనవేల వాగ్దానాల్ని రెపరెపలాడించినా హోలు మొత్తంగా ఓటరుదేవుళ్ళను భుజాలపై ఎత్తుకుని ఊరూ వాడా ఊరేగించినా ప్రజలెప్పుడూ వెర్రి వాళ్ళు కానే కారని గత అనుభవాలు చెప్పకనే చెప్తూనే ఉన్నాయ్ జనం ఆలోచనలు మెదడు పొరల్లో గుసగుసలాడుతూ కదుల్తూనే ఉంటాయ్ వాళ్ళ ఎంపికలు మనసుపేటికల్లో భద్రంగా సీలు చేయబడే ఉంటాయ్ ఒకోసారి ఒక ఆశ తాత్కాలిక చలనమై అలలా హృదయాన్ని తాకినా ఒక్కక్షణం మనసు సంచలించినా తొలినిర్ణయం మాత్రం సుస్థిరమే దాన్ని పెళ్ళగించాలనుకోవటం అజ్ణానమే మళ్ళీమళ్ళీ బతుకు చిత్రాన్ని తెలివిగల ఓటరెప్పుడూ వెలిసి పోనివ్వడు సుమా ఇది సత్యం ఇదే నిత్యసత్యం. -- సమాప్తం-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి