19, ఏప్రిల్ 2016, మంగళవారం

madhukalasam


               డా . పి . శ్రీదేవి కవిత్వ చిరునామా  "మధుకలశమ్ "

  ఉమర్ ఖయ్యాం రుబాయత్ లను సాహిత్యరంగం లో వివిథప్రక్రియారూపాలలో అనేకమందికవులు తమదైన ముద్రతో వెలువరించారు. అదే  కోవలొ డా.పీ శ్రీదేవి కూడా "మధుకలశం" పేరున కావ్యరూపాన్ని ఇచ్చింది .ఈ "మధుకలశం" రచన 4-4-1959 నుండి ఎనిమిది వారాల పాటూ 'స్వతంత్ర   వారపత్రికలో థారావాహికగా ప్రచురితమైంది.
   శ్రీదేవికి  దువ్వూ రి రామిరెడ్డిగారి "పానశాల" చాలా అభిమాన గ్రంథం గా చెప్పుకో వచ్చును ఎందుకంటే ఆమె నవల "కాలాతీతవ్యక్తులూ లో దీని ప్రస్థావన రెండుసార్లు వచ్చింది.
         పారశీక ఛంథస్సు మాత్రాగణబధం గా వుంటుంది.పారశీలో మన్నది,కసీదా,గజల్,రుబాయత్ అనే ప్రక్రియలు ప్రసిద్ధమైనవి. వీటిలో వుమర్ ఖయ్యాం రాసిన ప్రక్రియ రుబాయ్. ఇది నాలుగు పదాలు కలిగి నీతులు వంటివి చెప్పటానికి తే టగీతి లా అనువుగా వుండే ప్రక్రియ .కాని ఉమర్ ఖయ్యం  ఈ ప్రక్రియలో  సాఖీ ,ప్రకృతిల రమణీయకతను ,సౌందర్య వర్ణనను  ,మధుపానం లోని ఆనందమే కాకుండా తాత్వికచింతననూ  మూఢవిశ్వాస ఖండ న వంటి అనేక అంశాల్ని  ఈ రుబాయత్ ల లొ వర్ణించాడు ..వేమన పద్యాలలాగే కాలం గడ చిన కొద్దీ ఆయన మరణా నంతరం నాటికి 800 లకు పైగా లభ్యమయ్యాయి.
             ఖయ్యామ్ రుబాయ్ లను ఇతర భాషలలోకి తర్జుమా చేసినప్పుడు మక్కీకి మక్కిగా అనువాదం కాక మాతృకలోని సున్నితమైన ,రమణీయమైన భావాలను తీసుకొని తదనంతర కవులు స్వతంత్రంగా రాసారు. 
  అదే పధ్ధతి ని రామిరెడ్డి గారు 125 ఛందోబద్ద మైన పద్యాల రూపం లో "పానశాల " ను వెలువరించారు. శ్రీదేవి కూ డా ఆ విధానాన్నే అనుసరించి  రామిరెడ్డిగారి అనువాదితగ్రంధం "పానశాలలోని మూలభావాన్ని సారాంశాన్ని గ్రహించి తనదైన శైలి లో స్వతంత్ర రచన అనిపించేలా కావ్యరూపాన్నిచ్చింది .
            శ్రీదేవి కి చందోబద్ద కవిత్వం పట్ల ఒకింత అభిరుచి వుండటం వలన కావచ్చు,లేదా రుబాయ్ లు చందస్సు లో రాసినవి కనుక అలానే రాయాలన్న అభిమానం తో కావచ్చు ఆమె కూడా కొంత మేరకు మాత్రా చంధస్సుని అనుసరించింది .   "మధుకలశమ్ కావ్యం లో సుమారు 1200 లు పైగానే పంక్తు లు వున్నాయి. చాలా వారకు  ప్రతీ పంక్తిలోనూ  పది మాత్రలు కలి గి వున్నాయి కొన్ని చోట్ల మాత్రం తొమ్మిది మాత్రలు కలిగిన పంక్తు లు వున్నాయి.
  "కట్టకడపట  మనము/ 
   కనులు మూయుట స్థిరము 
   నిదుర లెమ్మిక సఖీ 
   మదిరమీయగ రమ్ము"
 మధ్యలో కొన్ని చోట్ల ముత్యాలసరాల చంధస్సుని కూడా అనుసరించింది .
  "పరువు కోసం ప్రాకులాడే 
   పలితకేశులు పట్టి చూసిన 
   పట్టపగలే పట్టుబడుదురు
   పానశా లల్లో "
  ఒక రెండు మూడు పేజీలలో గేయరూపమ్ లో రాసి నట్ల్లు గా కూడా కనిపిస్తాయి.
  "నీ చెక్కుటద్దముల 
   నీ రక్త కాంతులలో
         విలసనము 
         వికసనము 
  నీ లేత పెదవులను 
  నింపారు లేలేత 
          వర్ణముల 
          వర్తనము" -ఈ  విధం గాబహుశా   ఒక్కొక్క వారం ఒక్కో పద్ధతిలో  రాయాలని కవయిత్రి అను కుందేమో మరి అందు వలనే ఆ రకమైన వైవిధ్యం తో రాసిందని భావించాలి . కాని సుమారు 1200 పైగా పంక్తులతో కూడిన ఈ కావ్యం లో ఎనభై శా తానికి పైగా ప్రతీ వాక్యము పది మాత్రల పంక్తులే. 
            రామిరెడ్డిగారు వారి "పానశాల" గ్రంధానికి ముప్పై రెం డుపేజీల   ముందుమాట రాసుకున్నారు. అందులో ఉమర్ ఖయ్యామ్ జీ వితం,జీవనవిధానం ,అభిరుచులు,దృక్పధమ్ ,సాహిత్యం,సాహిత్యేతర విశేషా లు సవివరం గా రాసారు.
         ఖయ్యామ్ గణిత శాస్త్రం ,జ్యోతిష్ శాస్త్రం దాతురసాయన శాస్త్రం ,తత్వ శాస్త్రములలో పండితుడు అని తెలియజేసారు .వీటన్నింటిలోను తొమ్మిది గ్రంధాలు రాసాడని అవి వివిధ దేశాల గ్రందాలయాల్లో భద్రపరచబడినవని తెలిపారు . ఈ సందర్భం లో ఖయ్యామ్ కి గల హేతు వాద దృక్ప ధం,మతవిశ్వాసాల పట్ల ఆయనకీ గల ఖచ్చితమైన అభిప్రాయాలను విశదపరిచారు .  ఉమర్ ఖయ్యామ్ రాసిన రుబాయత్ లను అనుసరించి ఇంకా కొందరు రుబాయత్ లను రాసారని అందువల్లనే గ్రంధస్తం అవుతున్నప్పుడు వాటి సంఖ్యా పెరిగిందని చెప్పారు. అనువాదం లోకూడా అనేక భాషా రూపాలలో ,భావప్రకటన లలో సారాంశం లో అనేక రూపాంత రాలు పొందాయని రాసారు,
  ఆ విషయాలన్నింటిని శ్రీదేవి క్రోడీకరించుకొని ఉమర్ ఖయ్యామ్ రుబాయత్ లలోని సారాంశాన్ని రామిరెడ్డిగారి పానశాలపద్యసారాన్ని అవుపోసనపట్టి తనదైన పద్ధతిలో ఖయ్యామ్ భావనలకు అపభ్రంశం కాని రీతిలొ అనుసృ జనే అయినా స్వేచ్చా శైలిలో కావ్యరూపాన్నిచ్చింది .అందువలన పానశాల లొని పద్యాన్శాల కీ శ్రీదేవి కావ్యాన్శాలకి భావసారూప్యమ్ చాలా త క్కువ.రామిరెడ్డి గారి ప్రతి పద్యం సాఖి సౌంద ర్యం ప్రకృతి  ఆరాధన,మధుపానసేవనమ్ లోని ఆత్మానందం తో కూడినవిగా వుంది . 
            శ్రీదేవి ఎక్కువభాగాన్ని పానశాల ముందు మాట లోని ఉమర్ ఖయ్యామ్ జీవితాన్ని ,జీవనవిధానాన్ని ,వివిద అంశాల పట్ల ఖయ్యామ్ కి గల అభిప్రాయాల్ని ,అంత కరణనీ పరిగణనలోకి తీసుకొని రాయటం విశేషం . అందుకని మధుకలశమ్ లో ఆసాంతం ఒక గోలుసుకతలా విస్తరించుకొని కావ్యరూపమ్సంతరించుకుంది  .
    ఖయ్యామ్ రుబాయత్ లు ఏకధారగా రాసినవి కావు.వివిధ మనఃస్తితులలో అప్పుడప్పుడు మిత్రమండ లులలోనో ,శిష్యుల వద్దనో అలవోకగా చెప్పినవి కావటాన కొన్ని భావాలు చర్వితచరణమ్ కావటం తో కావ్యనియమాలకి ఒదిగి నవి కావు.అందుకే కావచ్చు శ్రీదేవి మధుకలశమ్ రాసేటప్పుడు ఒక పధ్ధతిగా తనరచన  లోపన్నెండు వుపశిర్శికలుగా విభజించి కధనపద్ధతిలో రాసింది .
            కేవలం పానశా లలోని పద్యసారాన్ని మాత్రమే తీసుకోక పోవటం అతి కొద్ది పద్యాల సారాంశ మే "మధుకలశమ్' లో గుర్తించగలుగుతా ము.ఉమర్ ఖయ్యామ్  భావనకి తన భావనల్ని జోడించి ప్రేమ తత్త్వం లోని తాత్విక నేపధ్యాన్నిఒదిగేలా  పా ట కుల హృదయా ల్ని జాగృ త పరిచేలా కవయిత్రి   రచన ఆలోచింప జేస్తుంది 
      "బుద్ధిమతియైననూ 
       భూమీశూడైననూ 
       భక్తవత్సలుడైన 
      శక్తివంతుడైన 
      బిచ్చగాడైననూ  
       పిచ్చివాడైననూ  
       పుట్టినపుడొక్క డే 
       గిట్టినపుడొకడే" -అనే సార్వజనీన దృక్పధాన్ని వ్యక్తపరిచింది .
    'ప్రకృతి-నువ్వు-నేనూ'అనే అధ్యాయం లో ప్రకృతి సౌం దర్యాన్ని ,వివిధ పూల  పరిమళాల్ని వర్ణించేటప్పుడు పాప నవ్వులతోటీ ,నిండు చూలాలి తోటి,పోలిక చెప్తూ రాయటం లో కవయిత్రి స్త్రీ అనుభూతులని ప్రకటించటం అత్యంత సహజం గా వుంది . 
        వసంతఋతువు, గ్రీష్మ రుతువు ,వర్షఋతువు శరదృతువు ,హేమంత ఋతువు ఇలా వరసాగ్గా ప్రతీ రుతు వర్ణనను క్లుప్తం గానే అయినా సఖి సౌందర్యాన్ని తాత్విక దృక్పధం తో కవిత్వీకరించె విధానం --
"నెలత నేనొల్లనే 
సుల్తాను పదవులను 
నిరసింతు రాజ్యముల 
నీరసపు భాగ్యముల" అనిచెప్తూ--
" ఈ పూవు వాస నలో 
చిక్కదనమెంత దో  
నీ కనుల కాంతి లో 
చక్కదనమంతా '   --అంటూ ప్రకృతి లోని పలు పోలికలతో వర్ణించుతూ  క్రమంగా --
'పచ్చని ని మేను 
పండుటాకు వలెను 
ఎండి పోవును గాదె 
ఎపుడైన ఒకనాడు "-ఇంకా--
" పూడ్చి వైచిన నిన్ను 
పూనికను తీయు టకు 
పుత్తడి బొమ్మ వా 
ముత్తెముల రాశివా " అని రాస్తూ చివరికి జీవితం బుద్బుద ప్రాయమైనదే అనే  ఖ య్యామ్ తాత్విక తను  శ్రీదేవి తనదైన సరళ శైలిలో తెలియజేస్తారు      
 .ప్రణయ  వర్ణనలో --"నీ  చకిత వీక్షణపు/ నిర్మలత్వము కనిన
                                                                           ఎద లోని బాధలే/తరలి పోవును కాదే 'అని ఇంకా ప్రేమ భావాల్ని ప్రకృతితో మమేకమై రమణీయమైన పంక్తులతో ఈ విధం గా అక్షరీకరిస్తుంది
"ఒక వర్షానికే ఉబికి ప్రవహించేటి/కొండవాగు ను నేను"అంటూ విరహవేదనని వ్యక్తపరుస్తూనే తాత్వికచింత న  నిప్రదర్శిస్తూనే నిరాశలో కుంగిపోతున్న పంక్తులు ఇవి --
"నీవు  మాత్రమే సఖి /నిలుతువా అచిరమై
 మృదులమౌ  నీ మేను /మృతిచెందు  ఒకనాడు
 మృత్తికలో లీనమై /ముగుద  నశియించునే"'అనే వాక్యాలలో ఖయ్యామ్ కు గల శాస్త్రీయ దృక్పధాన్ని కవయిత్రి వెల్లడిస్తుంది  
సాధారణం గా ఆస్తికులు శరీరమ్ నశిస్తుందని ఆత్మ  మాత్రం మళ్ళా మరో రూపం లో జన్మిస్తుందని నమ్ముతారు .కానీ ఖయ్యామ్ ధాతు రసాయనశా స్త్ర పండితుడు ఆ  విషయాన్ని అవగాహన చేసుకున్న కవయిత్రి తన రచనలో ఆత్మా నశిస్తుంది కాని భూమిలో కలసిన శరీరం లోని కణజాలం ఆ మట్టితో చేయబడిన మట్టిపాత్రలొ అమరుతాయని చెప్పిన ఉమర్ ఖయ్యామ్ చెప్పే ధాతురసాయన   సిద్ధాంతాన్ని అక్షరబద్ధం చేయదలచింది కనుకనే ఈ కావ్యం లో మృత్  పాత్రల  కథ అన్న శీర్షి కలొ  మట్టిపాత్ర తానూ పూర్వజన్మ లో అహంకారి నని అందుకే మరణానంతరం మట్టిలో కలసిన తర్వాత మట్టిపాత్రలు చేయు వాని కాళ్ళ కింద నలిగి బాధ పడుతున్నానని చెప్తూ--
"మట్టి యన నేమిరా/మట్టిలో చేరినది /మానవులే కాదురా"అనే సత్యాన్ని నిర్భయంగా చాటుతుంది 
  జీవితం పై నిస్పృహతో సాధారణం గా మానవులు ఆధ్యాత్మికం వైపు మళ్ళు తారు మనిషికి మతానికీ  మధ్యగల వైరుధ్యాన్ని ప్రకటిస్తూ కవిత్వికరించిన విధం సుస్పష్టం  గా వుంటుంది --
"భక్తిలోనే ముక్తి యున్నది/భక్తిచేతనె బాధ తొలగును
అనుచు మార్గము చూపువారలు /పృధి వి దాటిన జీవుడేయే
గతులన్ ప్రయాణించునొ చెప్ప /గలరా నెచ్చెలీ"
మతము గితమంటూను /హితము చెప్పుదు  మనుచు
మతబోధ చేసేటి /మతిమంతు లంద రూ
మనుదురా లోకమున /మన్నులో కలియకనే "హేతువాదద్రుక్పధమ్ తో కూడిన తర్కవితర్కాలు కవయిత్రి  తనకి తానె చెప్పుకుంటున్నట్లు గా పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది .
"ఉన్నదో లేనిదో /మనకి తెలియని స్వర్గం
ఎచటనుంటే  నేమి /బతుకు విధమును చెప్పుచో
భయము చెందేదరెందు కో"-- మూఢ విశ్వాసం వ దులు కోమని  జాగృత పరిచేలా
  అక్ష రీ రించింది శ్రీదేవి అ రచేతిలొని ఫలాల్ని వదిలేసి అందని ద్రాక్షలకు అర్రులు చాచే మానవ మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తుంది .
"కీడైన మేలైన /వాడె మూ లమ్ము కదా
పాపమని పున్నేమని /ప రదాలు కట్టుచో
పరమేశుడే యేల /పాపులను పుట్టించే"నంటూ జీవితం లో జరిగే కర్మలు  అన్నింటికీ భగవంతుడినే కర్త గా చెప్పే పలాయనవాదాలతో కూడిన కర్మసిద్ధాంతాన్ని ఖండిస్తూనే తన తప్పు ఒప్పు లన్నింటికి భగవంతుడే కారణం గా విన్నవించటమంటే పాప భయం నుండి పుట్టిన భక్తితత్వం గా విశదీకరిస్తుంది .
విధిచేష్ట లు అనే అధ్యాయం లో అందమైన చిత్రపటం వేసి తానే చింపే సినట్లు  ,కుండలు అందం గా పేర్చిపగలగొట్టినట్లు  ,తోలు బొమ్మలుగా ఆడించి దారాన్ని తెంచివైచినట్లు, ప్రేమతో శ్రద్ధతో పొలాన్ని పెంచి నీటిలో ముంచేసినట్లు ,చంటిపాపడు  బొమ్మ తో ఆటలాడి జోల పాడి  ,తర్వాత పగల గొట్టిన విధం గా విధిచేష్ట లు వుంటాయని సృష్టి  వైచిత్రిని తప్పుపడుతుంది కవయిత్రి   ఈ సందర్భం లో కవిత్వికరించిన పంక్తులు --
'విశ్వమనియెడు వింత చిత్రము/విరచించి యా విశ్వకర్త యె/
విశ్వమంద లి అందచందము /లన్నింటిని అంతము చేయుట
అనూహ్యన్బీ వింత చేష్ట ల్"అంటూ విధిచేసేవింత నాట కాలను పరిపరి విధాలుగా తలచి వినిపించుతుంది .
     మధుకలశమ్ కావ్యం లో కధకురాలిగా పేరొందిన శ్రీదేవి తనకు కథనం పట్ల గల అనురక్తిని ఇందులో కూడా ప్రస్ఫు టమ్  చేసేందుకు అన్నట్లుగా ప్రత్యే కశ్ర ద్ధతో ఉపకథ గా మృత్పాత్రల కథ అనే అధ్యాయం విడిగా రాయటం ప్రత్యేకం గా చెప్పుకొవలసినదే అ ప్పటికి వచనకవితా కథ  ప్రక్రియగా కవిత్వం లోనికిరాలేదు .  అందువల్ల ఈ దీర్ఘకావ్యమ్ లోని ఈ అధ్యాయానికి ఒక ప్రత్యేకత వుందని భావించవచ్చును.
       ఈ అధ్యాయమ్  లో కుమ్మరి మట్టిని మెత్తగా చేయటానికి కాళ్ళతో తొక్కుతుంటాడు ఆప్పుడు
ఆ కుమ్మరి వానితో ఆ మట్టి తానూ ముందు జన్మ లో అందమైన మనిషినే అని (మరణానంతరం  మనిషి మట్టిలో కలుస్తాడు కనుక ప్రతి మట్టి రేణువులో మానవ శరీర కణజాలం వుంటాయని దాతురసాయన శాస్త్రజ్ఞుడైన ఉమర్ ఖయ్యామ్ భావం) అహంభావం వలన నీ కాళ్ళ కింద నలిగిన  జీవం చేస్తున్నఆక్రందన  వినలేదా అనీ  పూర్వజన్మ లో  పాపఫలితామే నేనీ నాడు నీకాళ్ళకింద  నలుగు తున్నానని వాపోతుంది .ఈ సందర్భం లో --
  "మధుభాండమును గూల్చి /మట్టిపాత్రయే కదా
   మరియొకటి దొరుకునని/మర్మమేరు గ క పలుకు
   మట్టియననేమిరా/మట్టిలో చేరినది/మానవులే కాదరా"
అని చివరకు అందరు చేరాల్సింది మట్టిలోనే కదా  అని కథకు ముక్తాయింపు  నిచ్చింది కవయిత్రిమానవజీవితకాలమ్ ఎంత చిన్నదో తెలియజేసేందుకు ఇంకా ఇలా
 రాస్తుంది --"నిన్న పూచిన పారిజాతము/నేడు పూయక మోడు వారును
 చిన్నదానా బతుకు చిన్నది/మిన్నకుండకుమా'"--అంటూ జీవనపరిమాణాన్ని గూర్చిజాగృ తపరిచేలా అక్షరీ కరించింది
 .     
  శ్రీదేవి తనవచ న రచనల లో సరళసంభాషణ లు రాసినట్లుగానే మధు కలశమ్ లో కూడా చాలా వరకు తేలికైన తేటతెలుగు పదాల తోనే రాసినా ఒక్కొక్క సారి కవిత్వం లో సంస్కృత సమాసాల పదాడంబరాన్ని ప్రదర్శించేలా కూడా అంతే  అలవోకగా రాసింది . "మనోజ్ణ పూర్ణిమా సమయమిది /మాధవీ మధు సౌరభాలివి "
"ప్రదోష రాగ రక్తిమలు / ప్రభావించు  నభ మంతా"--వంటి గంభీర సమాసాలను రాసే తీరు కవయిత్రికి భాషపై గల పట్టు.అనురక్తి కూడా వ్యక్తమౌతుంది .
ఈ రచన లో ని చివరగా 'నా యిష్ట మైనచో'అనే ముగింపు అధ్యాయం లో వైరాగ్యాన్ని ప్రదర్శించిన తీరు మరువలేనిది .--
 "  స్వేచ్చ నిచ్చితి నీకు /ఇచ్చవచ్చిన యటుల
    వచ్చిపో నీవనిన /వచ్చుటే మానుదు ను
   వచ్చిన ను మది ఇంక  / చచ్చిపోనేపో ను
   గిట్టి పోవుట కొరకు /పుట్టనేలా భువిని
   పుట్ట గొడుగుల వలెనె/పుట్టి చచ్చిన యెడల /మట్టి బతుకే గాదె" అంటూ ఈ ప్రకృతి సౌందర్యము ,అందించిన సౌఖ్యాలు,అనుభవించినప్పుడే  కాక ఎక్కడో స్వర్గం వుందని ఎదురు చూపు వ్యర్ధమనికవిత్వీ కరించింది .ఖయ్యామ్ మాట ల్లో -- "సృష్టి  లో తీయనిది /సృష్టించే  మనకోరకే' అని సఖిని ఆహ్వానించుతాడు . అంతే  కాక "తనువూ నిత్యమూ కాదు /తలపు సత్యము కాదు /ఈ క్షణమే మనకు గల సత్యమంటారు"అందుకని తన మాటల్ని వినమని అర్ధిస్తాడు ,"ఆలకిన్పుము సఖి /చింతలన్నియు వదిలి /వంత  పాడుము నాకు అంటూ తన అభ్య ర్దనను ముగించినట్లు గా అక్షరీకరించింది 
  ఈ కావ్యమంతా ఉమర్ ఖయ్యామ్ రుబాయత్ ల ఆధారం గానో ,కవయిత్రికి ఎంతో  ఇష్టమైన దువ్వూరి రామిరే డ్డి గారి 'పానశాల' ప్రభావం తోనో రాసివుండొచ్చు కాని ఇందులో పి  శ్రీదేవి కి గల భావ పరంపరల నెన్నింటినో ప్రతిబింబిస్తాయి .కావ్యం ఆసాంతం పంక్తుల వెంట పాటకుడిని పరిగెత్తించేలా సాగుతుంది .
       మధుకలశమ్ కావ్యం స్వతంత్ర లో ధారావాహికగా వస్తూ  జూన్ 1959 లో ఆఖరిభాగం ప్రచురితమైంది .తర్వాత సుమారు రెండు సంవత్సరాలు తిరగ కుండానే కవయిత్రి పి శ్రీదేవి  ఈ లోకం నుండి నిష్ర్క మించింది .
   ఇందులో ఆమె వ్యక్తపరచిన భావాలలో -"ఒక్కసారైనాను/రెప్పపాటైనానూ /చుక్కవలె మెరిసితే /నిక్కమగు బ్రతు కదే" అనే వాక్యాలు చదివినప్పుడు సాహిత్య రంగం లో తనకొక చెరగని ముద్రని వేసుకొని మరీ వెల్లి పోయింద నే భావం చదువరి మనసులో మెదులుతుంది .       .
 మరో సందర్భం లో నూ --"సెలయేరు నీరులా/జరజరా ప్రవహించు
                                             కాలమను నీ వాగు /గలగలా రాలేటి
                                            పండుటాకుల వలెనె/మెలమెల్లగా జారు /నిండుజీవితమెపుడో"
అంటూ రచనలో ఇంత  తాత్వికచింత న ను ఇరవై ఎనిమిదేళ్ళ చిన్న వయస్సులోనే వెలిబుచ్చటమ్ ఆశ్చర్యం గొలుపుతుంది  .
   ఆరు   సంవత్సరాల సాహిత్య జీవితం లోనే పి శ్రీదేవి ఆణిముత్యాల వంటి రచనలు 
  వెలువరించింది అటువంటి రచనలలో  1959 లొనే ఇం త  అద్భుతమైన శైలీ విన్యాసం తో
   పూర్తిగా  స్వతంత్ర రచనే అనిపించేలా దీర్ఘకావ్యాన్ని రచించిన ఈమె ని సాహిత్య రంగం లో నవలారచయిత్రిగా ,కథా రచయిత్రిగానే  తప్ప కవయిత్రిగా గుర్తించక పోవటం ఆశ్చర్యం గానే వుంది